
తప్పుడు ప్రచారాలు సిగ్గుచేటు
నెల్లూరు(బారకాసు): తమ కుటుంబం గురించి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని వైఎస్సార్‌సీపీ రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్‌సీపీ నేత కబ్జా చేశారంటూ ఎల్లో మీడియాలో అసత్య వార్తను ప్రచారం చేయడంపై చింతారెడ్డిపాళెంలోని ఆయన నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 1946లో నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్, సర్వేపల్లి కాలువ పక్కనే ఉన్న స్థలం ఓరుగంటి వెంకటరెడ్డికి చెందినదని, అందులో ప్రభుత్వ అనుమతులు పొంది ఆయన పేరుమీద రైస్‌మిల్లును నిర్మించారన్నారు. ఆ మిల్లును వెంకటరెడ్డి కుమార్తె అయిన నా తల్లి వెంకటరమణమ్మకు రాసిచ్చినట్లు తెలిపారు. ఇందులో మా నలుగురు అన్నదమ్ములకు సమాన భాగం ఉండేలా మా తల్లి సెటిల్‌మెంట్ పత్రం రాసిపెట్టిందని, ఆ పత్రం తన వద్దే ఉందని మీడియాకు చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు విషయాల్లో ఒకటైన రైసుమిల్లుకు సంబంధించిన విషయాలను మొదటి నుంచి తానే చూసుకునేవాడినని వెల్లడించారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్టరీల శాఖ నుంచి అనుమతి పొంది నిబంధనల మేరకే రైస్‌మిల్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా రైస్‌మిల్లు స్థలానికి సంబంధించి అప్పట్లో శిస్తులు, ప్రస్తుత కార్పొరేషన్‌కు కూడా పన్ను, విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లకు పైబడిన రైస్‌మిల్లు నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, దానిని తొలగించి నూతన నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో మా కుటుంబసభ్యుల ఆమోదంతోనే శంకుస్థాపన చేశామన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఆనం కుటుంబానికి చెందిన స్థలాన్ని తానేదో కబ్జా చేస్తున్నానని అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని, దీంతో వారు వచ్చి స్థలాన్ని పరిశీలించి పత్రాలను సరిచూసి వెనుదిరిగి వెళ్లారన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు సమాచారం అందజేసి నాపై దుష్ప్రచారం చేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
నాపై బురద జల్లేందుకు యత్నిస్తే ఉపేక్షించను
వైఎస్సార్‌సీపీ రూరల్ ఇన్‌చార్జి
ఆనం విజయకుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment