
కుటుంబ కలహాలతో..
ఉదయగిరి: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ ఉదయగిరి ఆనకట్టలో శవమై తేలిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని యాదవవీధికి చెందిన పువ్వాడి ధనలక్ష్మి (53) అనే మహిళకు 35 సంవత్సరాల క్రితం వెంకటాద్రి అనే వ్యక్తితో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు హరినాథ్‌కు వివాహమై తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కుమార్తెకు వివాహమై గుంటూరులో ఉంటోంది. హరినాథ్‌కు భార్య శిరీషతో విభేదాలున్నాయి. బుధవారం వారి మధ్య వివాదం నెలకొనడంతో ధనలక్ష్మి ఎవరికీ చెప్పకుండా గుంటూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన బంగారు ఆభరణాలను కిటికీలో నుంచి వారి ఇంట్లోకి విసిరింది. అనంతరం కారును అద్దెకు తీసుకొని అర్ధరాత్రి సమయంలో ఉదయగిరి ఆనకట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద దిగింది. అయితే ఇంటికి వెళ్లకుండా సమీపంలోని ఆనకట్ట నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆనకట్టపై వాకింగ్ చేస్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో ఆనకట్ట వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భార్య కనిపించడం లేదని వెంకటాద్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. కాగా మృతురాలి తండ్రి బాలయ్య తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటి నుంచి
వెళ్లిపోయిన మహిళ
ఉదయగిరి ఆనకట్టలో
మృతదేహం
అనుమానం
వ్యక్తం చేసిన తండ్రి
Comments
Please login to add a commentAdd a comment