
వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
ఎవరేమన్నారంటే..
నెల్లూరు(బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. పలువురు కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాల్లేవు. ఏపీజే అబ్దుల్ కాలం సమావేశ మందిరంలో మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యల కంటే అంజెండా ఆమోదమే మిన్న అంటూ అధికార సభ్యులు వ్యవహరించడంపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. అజెండాలో పొందుపరిచినవి ఆర్థిక అంశాలేనని.. నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌యాంటిసిపేషన్ ఆర్డర్లకు సంబంధించిన అజెండాను తయరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కార్పొరేటర్లు.. వైఎస్సార్‌సీపీ వారిని మాట్లాడనివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతూ సమావేశాన్ని సజావుగా జరగనివ్వలేదు. చివరకు అజెండాలోని 91 అంశాలను ఆల్‌పాస్ చేసి ముగించారు. వివిధ సమస్యలపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మేయర్‌కు వినతిపత్రం అందించారు.
రెచ్చిపోయి..
ముందుగా డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ అజెండాలోని అంశాలను చదివి వినిపించి ఆమోదింపజేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీంతో 37వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ముందుగా సమస్యలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని అడగ్గా అందుకు డిప్యూటీ మేయర్ తాను చెప్పిందే జరగాలంటూ అజెండా అంశాలను పూర్తి చేయాలన్నారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 13వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన సహచరుడు అడిగినట్లుగా తొలుత సమస్యలపై చర్చింకునేందుకు అవకాశం కల్పి ంచాలన్నారు. అయితే 9వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ నీవేంటి మాట్లాడేదంటూ నాగార్జున మీద రెచ్చిపోయాడు. కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి సమస్యలు చెప్పి కమిషనర్ సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. 46వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ప్రతి విషయానికి కమిషనర్ సమాధానం చెబుతుంటే సమయం సరిపోదని, మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతాప్‌రెడ్డి నీకెందుకంటూ మొదలుపెట్టగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ వారికి సర్ది చెప్పారు.
అడ్డుపడుతూ..
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పలు సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంటే అధికార పార్టీ కార్పొరేటర్లు అకారణంగా అడ్డుపడుతూ వచ్చారు. అధికశాతం మంది తమ డివిజన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ స్పందించి కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసిన్, కో–ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, అదనపు కమిషనర్ నందన్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్‌ఈ రామ్మోహన్‌రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, మేనేజర్ ఇనాయతుల్లా, అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సోలార్ ప్రాజెక్ట్
మేయర్ స్రవంతి మాట్లాడుతూ ప్రధాన అజెండాలోని 68 అంశాలు, సప్లిమెంటరీలోని 15 అంశాలు, టేబుల్ అజెండాలోని 8 అంశాలకు కార్పొరేటర్ల ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రూ.60 కోట్లతో నూతనంగా సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్‌ఎంసీకి సంబంధించిన ఖాళీ స్థలాలకు ప్రహరీ ఏర్పాటు చేసేందుకు రూ.25 కోట్ల నిధులు కేటాయించి ప్రతిపాదించారన్నారు.
కార్పొరేషన్‌లో రెచ్చిపోయిన
అధికార పార్టీ కార్పొరేటర్లు
సమస్యలు తర్వాత..
ఆర్థిక అంశాలే ముఖ్యం
పలువురు సభ్యుల మధ్య
మాటల యుద్ధం
వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన
ప్రశ్నలకు సరైన సమాధానాల్లేవు
అజెండాలోని 91 అంశాలు ఆల్ పాస్
37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇలా మాట్లాడారు. ప్రధాన అజెండాలోని అంశాల్లో మొత్తం 68 ఉండగా ఇందులో 60 అంశాలకు ముందస్తు అనుమతులున్నాయి. రూ.10 లక్షలకు నిధులు పైగా ఖర్చు చేయాలంటే కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. అలా చేయకుండానే రూ.200 కోట్లకు ముందస్తు అనుమతులిచ్చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్‌ఎంసీలో అధికారులు కొన్ని బదిలీలను నిబంధనలకు విరుద్ధంగా చేశారు. మేనేజర్, ఇద్దరు ఆర్వోలను బదిలీ చేసి ఆ ముగ్గురి స్థానాల్లో సూపరింటెండెంట్ కేడర్ ఉన్న అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కూడా చర్చించారు.
13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ నగర పాలక కమిషనర్ అధికారులతో కలిసి నా డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. అదే టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు మాత్రం సమాచారం ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?, కమిషనర్‌కు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని ఇది ఎంతవరకు సబబని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.
37వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఇలా స్పందించారు. ట్రేడ్ లైసెన్స్‌లు, ఇంటి పన్నులను వసూలు చేసే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతుల్ని చేయాలి. అప్పుడే ఇబ్బందులుండవు. నగరంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వీటి నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలి.
21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఇలా మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ పాలనలో నిధుల డైవర్షన్ జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎన్‌ఎంసీకి వచ్చిన అన్ని రకాల నిధులు, జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి విషయాలను ప్రజలకు తెలియజేయాలి. అజెండాలోని అంశాలు అధిక శాతం ఇన్‌యాంటిసిపేషన్ (ముందస్తు అనుమతులు)కు సంబంధించినవే పొందుపరిచారు. ఇది సరైన పద్ధతి కాదు. 21వ డివిజన్‌లో ప్రధాన డ్రెయిన్‌ను నిర్మాణం చేపట్టాలి. మాగుంట లేఅవుట్‌లో వాకింగ్ ట్రాక్, సైన్స్ పార్కు పక్కన ఉన్న రైల్వే లైన్ వెంబడి స్థలాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం