
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
● అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఐఎంఏ హాల్‌లో అపస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక విషయాల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసిందని, జీతాలు తప్ప ఏ ఆర్థిక ప్రయోజనాలు లేవన్నారు. ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్స్, పీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్‌ఐ లోన్లు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చక్రపాణి, పుట్టాశేషు, జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, నాయకులు మణికందరాచారి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై
స్పిరిట్ ట్యాంకర్ బోల్తా
వెంకటాచలం: మండలంలోని గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద స్పిరిట్‌లోడు లారీ ట్యాంకర్ అదుపుతప్పి శుక్రవారం బోల్తాపడింది. నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వెళుతూ గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్‌లోని స్పిరిట్ రోడ్డుపై పొర్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిలకూట క్షేత్రం అభివృద్ధికి కృషి
● దేవదాయశాఖ మంత్రి ఆనం
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం అభివృద్ధికి దేవదాయశాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ప్రభుత్వం తరుపున మంత్రి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణ వేడుక పూర్తయిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడుతూ బిలకూట క్షేత్రం అభివృద్ధికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని, వారి కృషికి దేవదాయశాఖ తరపున సహకారం అందించి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.12.5 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేశారని, టెండర్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1.85 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, టీటీడీ నిధులు రూ.2.65 కోట్లతో గాలిగోపురం నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కల్యాణ కట్ట, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం పనులు కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు.

30 శాతం ఐఆర్ ప్రకటించాలి

30 శాతం ఐఆర్ ప్రకటించాలి
Comments
Please login to add a commentAdd a comment