
బియ్యం బ్యాగ్‌లో ఒకటిన్నర కిలోల తరుగు
హోల్‌సేల్ అంగడి నుంచి 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనుగోలు చేశాం. వాటిని తెలిసిన వారి దగ్గర కాటా పెడితే ఒకటిన్నర కిలోలు తగ్గాయి. అంటే ఒక బస్తా మీద కనీసం రూ.80 నష్టపోయాం. బియ్యం తగ్గాయని వ్యాపారులను అడిగితే వారు తాము తయారు చేయలేదని పైనుంచి అన్ని బస్తాలు అలాగే వస్తున్నాయి. ఏమీ చేయలేమని బుకాయిస్తున్నారు. చేసేదేమి లేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకుల్లో మోసం జరుగుతోంది. అధికారులు నిత్యం దాడులు చేస్తే ఇలాంటివి జరగవు. – రీహానా, బుజబుజనెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment