
తోపుడు బండ్లపై మోసం
రోడ్లపై తోపుడు బండ్లలో కూడా కాటాలు పెట్టి వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. సాక్షి విజిట్ సందర్భంగా వేదాయపాళేనికి చెందిన సుబ్బారావు అనే వినియోగదారుడు కేజీ దానిమ్మ కాయలు కొనుగోలు చేశాడు. సాక్షి కెమెరాను చూడడంతో ఆ వ్యాపారస్తుడు కేజీ రాయితో పాటు 400 గ్రాములు అదనంగా తూచి వినియోగదారుడికి ఇచ్చాడు. మొత్తం 1,400 గ్రాములు తూగాల్సి ఉంది. దానిమ్మ కాయలను మార్కెట్‌లో మరో వేయింగ్ మిషన్‌లో పరిశీలించగా 1,135 గ్రాములు వచ్చింది. కాటాల్లో టెక్నిక్‌లను ఉపయోగించి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment