
కావలి డీఎస్పీ వైఖరి సిగ్గుచేటు
కావలి: స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వద్ద మీడియా ముసుగులో ఉన్న బ్రోకర్‌కు కావలి డీఎస్పీ శ్రీధర్ భయపడటం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే అరాచకాలపై వార్తలు రాసేవారిపై పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వద్ద ఉన్న ఓ మీడియా బ్రోకర్ పోలీస్ శాఖనే శాసిస్తూ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. సదరు వ్యక్తి తనపై అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో కావలి డీఎస్పీని కలిశానని, అయితే తనపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఏమీ చేయలేనని, ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి వైఖరితో ఉన్న డీఎస్పీని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కావలిలో మనీ స్కీమ్ పేరుతో రూ.100 కోట్లకుపైగా దోచేశారని, ఇందులో కొందరు పోలీసుల పాత్రా ఉందన్నారు. ఇప్పటి వరకు కేసు విచారణ ఏమైందో.. రికవరీ చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికెళ్లాయో పోలీసులు వెల్లడించలేదని ఆరోపించారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా పత్రిక స్వేచ్ఛను హరించేలా దిగజారి ప్రవర్తిస్తుండటం బాధాకరమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్తగా నిధులు తీసుకొచ్చి.. చేసిందేమీ లేదని, తన హయాంలో మంజూరైన పనులనే చేస్తూ, వాటిని తాను చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రుద్రకోటలో భారీ ఎత్తున గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటే గ్రామస్తులు ప్రశ్నించగా, మీ సంగతి చూస్తామని బెదిరించారని, ఈ విషయంలో ఓ విలేకరిని సైతం కట్టేసి కొట్టారని ఆరోపించారు. కావలిలో జరుగుతున్న దురాగాతాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టి సారించాలని కోరారు.
రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు
మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి