
నేత్రపర్వం.. రథోత్సవం
నెల్లూరు(బృందావనం) : బాలాజీనగర్‌లోని సీతారామస్వామి మందిరంలో అనంత కోదండరామస్వామి రథోత్సవం ఆదివారం నేత్రపర్వంగా నిర్వహించారు. నయనానందకరంగా తీర్చిదిద్దిన రథంపై సీతా లక్ష్మణ హనుమంత సమేత అనంత కోదండరామస్వామివారు సర్వాలంకారశోభితంగా కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ప్రధానార్చకుడు బృందావనం శ్రీనివాసదీక్షితులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు మూలవర్లు, ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు, తిరుమంజనాన్ని జరిపించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి ఉప్పు, మిరియాలను రథచక్రాలపై జల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. రథోత్సవం గౌడ హాస్టల్ సెంటర్, ఉగాది సెంటర్, ఏసీనగర్ మెయిన్‌రోడ్డు, బాలాజీనగర్ మెయిన్‌రోడ్డు మీదుగా మందిరానికి చేరింది. ఉభయకర్తలుగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి– సంధ్య దంపతులు వ్యవహరించారు. మందిర కమిటీ నిర్వాహకులు తన్నీరు మస్తాన్‌రావు, సోమిశెట్టి వెంకటరత్నం, కొప్పరపు శివప్రసాద్, మట్టా ప్రసన్నాంజనేయులు, అమరా మోహన్‌రావు, వీఎస్.ప్రసాద్‌రావు, స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వం.. రథోత్సవం

నేత్రపర్వం.. రథోత్సవం