పామాయిల్‌ చోరీ పచ్చదొంగల పనేనా! | - | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ చోరీ పచ్చదొంగల పనేనా!

Published Sun, Apr 27 2025 12:30 AM | Last Updated on Sun, Apr 27 2025 12:30 AM

పామాయిల్‌ చోరీ పచ్చదొంగల పనేనా!

పామాయిల్‌ చోరీ పచ్చదొంగల పనేనా!

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రూ.లక్షలు విలువ చేసే పామాయిల్‌ దొంగతనం కేసు పక్కదారి పడుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు పామాయిల్‌ ట్యాంకరు నుంచి ఆయిల్‌ దొంగిలించి ప్రమాదంగా చిత్రీకరించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తెరవెనుక నేరాలకు అలవాటు పడిన అధికార పార్టీకి చెందిన వారు ఉన్నారని, పోలీసు దర్యాప్తులో వారు బయటపడకుండా తప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురై ఆయిల్‌ కాలువలో కొట్టుకుపోయినట్టు చిత్రీకరించి పల్నాడు జిల్లాలో మరో ట్యాంకర్‌ ద్వారా విక్రయించి రూ.లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల పోలీసులు సైతం దర్యాప్తును నిక్కచ్చిగా చేపట్టలేక పోతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయిల్‌ చోరీలో పాత నేరస్తుల హస్తం

ముత్తుకూరు మండలంలోని ఓ పామాయిల్‌ పరిశ్రమ నుంచి 23.5 టన్నుల పామాయిల్‌ లోడుతో బయలుదేరిన ట్యాంకర్‌ నుంచి ఆయిల్‌ చోరీకి పాల్పడిన వారు పాత నేరస్తులేనని తెలుస్తోంది. వీరు రూ.43 లక్షల విలువైన పామాయిల్‌ను పక్కదారి పట్టించి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విక్రయించారు. ఈ పామాయిల్‌ దొంగతనానికి పాల్పడిన వారంతా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలానికి చెందినవారు. డ్రైవర్‌ మొలకడిపూడి గ్రామానికి చెందిన వాడు కాగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఈ నేరంలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటాచలంకు చెందిన అధికార పార్టీకి చెందిన నాయకుడినని చెప్పుకునే వ్యక్తికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన రెండు మాసాల క్రితం తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి నుంచి బంగారం అక్రమంగా తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తూ పట్టుబడి, నానాతంటాలు పడి అందులో నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. పామాయిల్‌ మాయంలోనూ ఇతనే ప్రధాన పాత్ర పోషించినట్టు చెప్పుకుంటున్నారు.

కేసు పక్కదారి పట్టించే యత్నం

పామాయిల్‌ దొంగతనం కేసులో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం వల్ల కేసు పక్కదారి పట్టే యత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముత్తుకూరు పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు రోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసుల దర్యాప్తు పక్కదారి పట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఆయిల్‌ కొనుగోలు చేసిన పిడుగురాళ్లకు కూడా వెళ్లి విచారణ నిర్వహించారు. దీంతో నిందితులు బయటపడడం, వారు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు కేసును నీరుగార్చుతారా? లేక అసలు దోషులను అరెస్ట్‌ చూపుతారా? అనే చర్చ జరుగుతోంది. ముత్తుకూరు పామాయిల్‌ ఫ్యాక్టరీల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా పోలీసులు చెక్‌ పెట్టలేకపోతున్నారు. ఈ పర్యాయం కాస్త విభిన్నంగా చోరీకి పాల్పడిన వారు ట్యాంకరును కాలువలో తోసి ప్రమాదంగా చిత్రీకరించి మరో ట్యాంకరుకు ఆయిల్‌ నింపుకుని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.

సూత్రధారులను వదిలేసి డ్రైవర్‌పై కేసు

చోరీచేసిన పామాయిల్‌

పిడుగురాళ్లలో విక్రయం

నిందితులంతా వెంకటాచలం వారే

కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement