
ముస్లింల ద్రోహి చంద్రబాబు
కందుకూరు: ఎన్నికల ముందు ముస్లింలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ అబద్ధపు హామీలివ్వడం. ఆ తర్వాత ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు విషయంలో ముస్లింలపై చంద్రబాబు వైఖరి మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబుకు ముస్లింలు అంటే గిట్టదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారని చెప్పారు. చంద్రబాబు మద్దతు లేకపోతే ఈ బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. అదే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ తరఫున బిల్లును వ్యతిరేకించి ముస్లింలకు అండగా నిలిచారన్నారు. సుప్రీంకోర్టులో చట్టానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారని గుర్తు చేశారు.
వక్ఫ్ చట్టంపై సుప్రీంలో న్యాయం
వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా దేశం మొత్తం ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయని, సుప్రీం కోర్టులో ముస్లింలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని విధాలా ముస్లింలను మోసం చేస్తున్న చంద్రబాబును ముస్లిం సమాజం పూర్తిగా వ్యతిరేకించాలన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముస్లింలకు అండగా నిలవలేదని గుర్తు చేశారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ. 83 వేల ఆర్థిక సాయం అందించారని, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించి అన్ని విధాలా అండగా నిలిచారని వివరించారు.
చట్టాన్ని ప్రతి ముస్లిం వ్యతిరేకించాలి
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫజుల్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చిందని, వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వివరించారు.
జగనన్నకు కృతజ్ఞతలు
వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం విషయంలో కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఇప్పటికై నా ముస్లింలు కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ సంధాని, సుల్తాన్, రహీం, ఖాదర్‌బాషా, జుబేర్, దస్తగిరి, బాబు, అన్వర్, మస్తాన్‌లి, మునీర్, షాకీర్, ఖాజాహుస్సేన్, అయూబ్‌ఖాన్, జిలాని, కరిమున్నీషా తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకొస్తారు
ముస్లింలకు అండగా నిలిచిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్
జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్
జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం