
జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయకేతనాన్ని ఎగురవేశారని విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నగరంలోని కళాశాలలో శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో పూర్వజ్ 337, హేమంత్‌సాయి 815, మధుకిరణ్‌రెడ్డి 1021, భానురిషిక్ 1216, అఖిలేష్ 1415, సంతోష్ 2004, వెంకట ఆకాష్ 2091, యశ్వంత్‌బాబీ 2417, సాయిశ్రీధన్‌రెడ్డి 2870, శశిజ్ఞాన కౌశిక్‌రెడ్డి 2950, ఆశ్రిత 3426, నరసింహతేజ 3651, వెంకటభరత్‌కుమార్‌రెడ్డి 4957 ర్యాంకులను సాధించారని వివరించారు.
‘విశ్వసాయి’
విజయదుందుభి
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను మాగుంట లేఅవుట్లోని కళాశాలలో శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో రామ్‌రుత్విక్ 208, శ్రావణ్‌కుమార్‌రెడ్డి 356 ర్యాంకులను సాధించారని వివరించారు. 57 మంది విద్యార్థులు ర్యాంకులను సాధించారన్నారు.
‘కృష్ణచైతన్య’ సత్తా
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కృష్ణచైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారని కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాణాప్రమోధ్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కళాశాలలో విద్యార్థులను శనివారం అభినందించిన అనంతరం వారు మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్మల్‌తేజ 274వ ర్యాంక్‌ను సాధించారని చెప్పారు. అభినవ్‌రెడ్డి 98.75, అజోసైఫీ 98.23, సాయికేతన్‌రెడ్డి 96.76, మౌనిక 96.44 పర్సంటైల్‌ను సాధించారన్నారు.
‘శ్రీచైతన్య’ హవా
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ఏజీఎం శ్రీరామ్ తెలిపారు. అన్నమయ్య సర్కిల్లోని కళాశాలలో విద్యార్థులను శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలో స్వరూప్ 99.71, సౌమ్యశ్రీ 98.81, ఉషశ్రీ 95.10, పవన్ 93.48, దినేష్ 93.08 పర్సంటైల్‌ను సాధించారని వెల్లడించారు.
మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో గల దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్‌లో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శనివారం తెలిపారు. మూడు యూనిట్లలో వరుసగా 260.. 270.. 245 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు.
ఆగ్రహానికి గురై
చేతి కడియంతో దాడి
నెల్లూరు(క్రైమ్): వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై కేసును సంతపేట పోలీసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. సంతపేటలోని బుజ్జమ్మరేవులో నివాసం ఉంటున్న కమల్.. పాలిష్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మద్యాన్ని ఎందుకు తాగుతున్నారంటూ ఆయన్ను భార్య గురువారం రాత్రి నిలదీశారు. ఇంతలో అటుగా వెళ్తున్న చలం, గొడవలేంటి అని ప్రశ్నించగా, అక్కడి నుంచి వెళ్లాలని కమల్ సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు చేతి కడియంతో కమల్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిమ్మ ధరలు
పెద్దవి: రూ.90 సన్నవి: రూ.65
పండ్లు: రూ.40
పౌల్ట్రీ ధరలు
బ్రాయిలర్: రూ.105
లేయర్ రూ.100
బ్రాయిలర్ చికెన్: రూ.194
స్కిన్‌లెస్ చికెన్: రూ.214
లేయర్ చికెన్: రూ.170

జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం

జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం

జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం

జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం