
ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు
నెల్లూరు (టౌన్): వార్షిక వర్క్ ప్లాన్ బడ్జెట్ 2024–25లో భాగంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో అదనపు గదులు నిర్మాణాలు, టాయిలెట్స్, ప్రహరీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 19 అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఒక్కో గదికి రూ.13.05 లక్షలు నిధులు మంజూరైనట్లు వివరించారు. 15 బాలుర, 10 బాలికల టాయిలెట్స్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.3.80 లక్షలు నిధులు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలోని 23 పాఠశాలల్లో ప్రహరీలు నిర్మించనున్నామని, ఒక్కో స్కూల్‌ల్లో 125 మీటర్లు చొప్పున ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతామన్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.9.31 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని సాయిపేట, వడ్డిపాళెం ఎంపీపీఎస్‌ల్లో రూ. 12 లక్షలతో మేజర్ వర్క్స్‌ను చేపట్టనున్నట్లు వివరించారు. పంచేడు, పల్లిపాడు ఎంపీపీఎస్‌ల్లో రూ.3 లక్షలతో ఎలక్ట్రికల్ పనులు చేపడుతున్నామన్నారు. మనబడి మన భవిష్యత్‌లో భాగంగా జిల్లాలోని 10 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్య కోసం భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఒక్కో కేజీబీవీలో 6 అదనపు గదులు, 10 టాయిలెట్స్‌తో పాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో కేజీబీవీకి రూ.2.55 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆయా కేజీబీవీల్లో మిగిలిన నాడు–నేడు పనులను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
10 కేజీబీవీల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్
సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య