
రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ
తోటపల్లిగూడూరు: మండలంలోని కో డూరు పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామంలో పొలాల్లో అమర్చిన రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికు ల కథనం మేరకు.. గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రైతులకు సంబంధించి పొలాల కు విద్యుత్ సరఫరాకు కొన్నేళ్ల క్రితం ట్రాన్స్‌కో రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. దీని వల్ల సుమారు 50 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతోంది. రెండురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పూర్తిగా చోరీ చేశారు. మరో దానిని పగులగొట్టి రాగివైరును ఎత్తుకెళ్లారు. దీనిని గుర్తించిన స్థానిక రైతులు కోడూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఓ ప్రతాప్‌కు సమాచారం అందించారు. ఏఈ శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని తెలిపారు. ఆయన తోటపల్లిగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సబ్ ట్రెజరీ భవనాన్ని
త్వరలో ప్రారంభిస్తాం
రాపూరు: జిల్లా కేంద్రమైన నెల్లూరులో నూతన సబ్ ట్రెజరీ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని జిల్లా ఖజానా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ డి.గంగాద్రి తెలిపారు. రాపూరులోని సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలాగే కావలి, ఆత్మకూరు, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాల్లో కూడా నూతన భవనాలు పూర్తయినట్లు వెల్లడించారు. కోవూరులో నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, బుచ్చిరెడ్డిపాళెంలో స్థల పరిశీలన జరుగుతోందన్నారు. పొదలకూరులో రీటెండర్లు జరిపి నిర్మాణాన్ని చేపడతామన్నారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయన వెంట ఉపఖజానాధికారి అబ్దుల్ అలీమ్, సిబ్బంది వెంకటకృష్ణ, అమీర్‌బాషా, సుబ్బరాయులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
యువకుడిపై పోక్సో కేసు
దొరవారిసత్రం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన అందలమాల శివ అనే యువకుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద గురువారం రాత్రి కేసు నమోదు చేయగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వారి కథనం మేరకు.. మండలంలోని కట్టువాపల్లిలో బంధువుల ఇంటికి నెల్లూరు నుంచి ఓ బాలిక వచ్చింది. ఆమెతో గ్రామానికి చెందిన శివ మూడు రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలిక సమీప బంధువులు ఫిర్యాదు చేశారు. ఎస్సై అజయ్‌కుమార్ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 45.541 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 330, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు పది క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ