( ఫైల్ ఫోటో )
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక సోదరుడు శ్రీకాంత్ (48) అనంతపురంలోని ఓ అద్దె ఇంట్లో మృతి చెందాడు. రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన రాధికకు శ్రీకాంత్ స్వయాన అన్న.
కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం శ్రీకాంత్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు తీసి పరిశీలించారు. లోపల శ్రీకాంత్ మృతదేహం కనిపించింది.
రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫిట్స్ వచ్చినప్పుడు సాయం చేసే వారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని శ్రీకాంత్ బంధువులూ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment