
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
పుట్టపర్తి టౌన్: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో జూమ్ ద్వారా నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, హత్యలు, చోరీలు తదితర కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నిందితుల అరెస్ట్ అయిన కేసుల్లో చార్జ్‌షీట్ త్వరగా దాఖలు చేపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి పరిష్కారం చూపాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని.. సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలని సూచించారు. ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టి.. అక్కడ ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. రోజూ విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేసి పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐ ప్రదీప్ కుమార్, ఐటీ కోర్ ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణను ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది, ఏఆర్ పోలీసులు శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు. ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఆర్‌ఐ మహేష్, ఎస్‌బీ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌తో పాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
పుట్టపర్తి టౌన్: అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వక్తలు తెలిపారు. శనివారం పుట్టపర్తిలో ఉన్న ఆర్టీసీ డిపో ఆవరణలో జిల్లాలో అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్, పర్సనల్ అకౌంట్ సూపర్‌వైజర్లు, అసోసియేషన్ సభ్యులతో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ రత్న, ఆర్టీఓ కరుణసాగర్‌రెడ్డి, ప్రజారవాణాధికారి మధుసూదన్, రెడ్‌క్రాస్ సొసైటీ సెక్రటరీ విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం 21 మందికి డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు అందజేసి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపాటి ప్రమాదానికి కూడా కారకులు కాకుండా 30 ఏళ్లకు పైగా డ్రైవింగ్ వృత్తిలో కొనసాగుతూ వచ్చిన కొంతమంది డ్రైవర్ల అంకితాభావాన్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment