
దారిలో పడిపోయిన బంగారు నగల బ్యాగు
తాడిపత్రి టౌన్: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో దారి మధ్యలో పడిపోయిన బంగారు నగల హ్యాండ్‌బ్యాగును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పది నిమిషాల్లో కనుక్కొని బాధితురాలికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పోరాట కాలనీకి చెందిన కవిత తన తల్లి లక్ష్మీ తో కలిసి శనివారం రాయదుర్గం వెళ్లేందుకు ఇంటి నుంచి ఆటోలో బస్టాండ్‌కు బయల్దేరారు. కొంత నగదుతో పాటు బంగారు నెక్లెస్, చైన్‌ను భద్రపరచిన హ్యాండ్‌బ్యాగును దుస్తుల సంచిపై పెట్టుకుంది. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత చూస్తే హ్యాండ్‌బ్యాగ్ కనిపించలేదు. దీంతో కవిత ఏడుస్తూ నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సాయిప్రసాద్‌కు జరిగిన విషయం చెప్పింది. అదే బ్యాగులో తన సెల్‌ఫోన్ కూడా ఉందని తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు లొకేషన్‌ను కనుగొని బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకుని ఆ ప్రదేశానికి బయల్దేరారు. చింతల వెంకటరమణస్వామి ఆలయ సమీపంలో బేకరీ నిర్వహిస్తున్న నాగమణి వద్ద ఆ బ్యాగు లభించింది. బ్యాగు దొరికిన వెంటనే పోలీసులకు అప్పగించాలి కదమ్మా అని పోలీసులు ప్రశ్నిస్తే.. ఈ రోజు ఇంట్లో ఎవ్వరూ మగవారు లేక పోవడంతో పోలీస్‌స్టేషన్‌కు రాలేక పోయానని నాగమణి చెప్పి.. బ్యాగు అందజేసింది. బ్యాగులో బంగారు నగలు, నగదు అన్నీ భద్రంగా ఉండడంతో కవిత ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పోలీసులకు, బ్యాగు అందజేసిన నాగమణికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
10 నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment