‘మిస్టర్ సౌత్ ఇండియా’ పోటీల్లో ప్రతిభ
రాయదుర్గంటౌన్: బెంగళూరులో ఆదివారం జరిగిన మిస్టర్ సౌత్ ఇండియా మెన్స్ ఫిజిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన యువకుడు కొలిమి దస్తగిరి మూడో స్థానం సాధించారు. ఆయన మొదటిసారిగా ఈవెంట్‌లో పాల్గొని ఈ ఘనత సాధించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది బాడీబిల్డర్లు పాల్గొనగా మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఏకై క పోటీదారుడు దస్తగిరి కావడం విశేషం. మొత్తం 60 మంది పోటీల్లో పాల్గొనగా దస్తగిరి మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మన్ముందు రాష్ట్రం నుంచి మరిన్ని పోటీల్లో పాల్గొంటానని దస్తగిరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment