ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అనంతపురం కల్చరల్: జిల్లా కేంద్రమైన అనంతపురంలో నిర్వహిస్తున్న బాలోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆదివారం నిర్వహించిన ముగింపు వేడుకల్లో జానపద గీతాలు, సందేశాత్మక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలతో విద్యార్థులు అలంరించారు. పెద్ద సంఖ్యలో వీక్షకులు తరలిరావడంతో స్థానిక లలితకళాపరిషత్తు, గిల్డ్ ఆఫ్ సర్వీసు ప్రాంగణాలు కిటకిటలాడాయి. సాయంత్రం నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రతిభ చాటిన వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ చైర్‌పర్సన్ షమీమ్, ఆర్‌ఐఓ వెంటరమణనాయక్, నిర్వాహకులు సావిత్రి, లలితకళాపరిషత్తు కార్యదర్శి పద్మజ, బాలోత్సవం కార్యదర్శి శ్రీనివాసరావు, ట్రెజరర్ జిలాన్, తరిమెల అమరనాథరెడ్డి, సీనియర్ కవి నబీరసూల్, డాక్టర్ కొండయ్య, కత్తి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment