హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ధర్మవరం: జిల్లాస్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ ఉమెన్ హ్యాండ్‌బాల్ జట్లను ఎంపిక చేసినట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రియాజ్ తెలిపారు. పట్టణంలోని యశోద పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ ఉమెన్ హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, వైఎస్‌ఎల్ ఎంటర్ ప్రైజెస్ చంద్రశేఖర్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రియాజ్, కార్యదర్శి సాకే శివశంకర్ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో కర్నూల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు.
బాలుర జట్టు:
సాయికిరణ్, హరినాథ్‌బాబు, వినయ్, సిద్విక్, ప్రసాద్ నాయక్, జశ్వంత్, నాగ మహేష్, ధనుష్, వినోద్ నాయక్, సాంబ, అశ్విన్ చౌదరి, రోహిత్, వినీత్‌రెడ్డి, కార్తీక్‌నాయక్, అశోక్, లోకేష్
సీనియర్ మహిళా జట్టు:
ధనూషా, గీతిక, లాస్య, లిఖిత, తన్మయి, రిషిక, ధనలక్ష్మి, హర్షవల్లి, మహేశ్వరి, మంజుల, మహిత, కీర్తి, హర్షప్రియ, తేజశ్విని, మెహరున్నీసా, మధుమతి
Comments
Please login to add a commentAdd a comment