చెత్త విషయంలో డిష్యుం.. డిష్యుం
గుత్తి: చెత్త పడేసి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం గుత్తి ఆర్‌ఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రసూల్– సాయమ్మ ఇళ్లు పక్క పక్కనే ఉన్నాయి. అయితే చెత్త పడేసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు కుటుంబానికి చెందిన వారు కత్తులు, కట్టెలతో పరస్పరం దాడులు దిగారు. ఈ ఘటనలో తల్లీ కొడుకు వంశీ, సాయమ్మ , రసూల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెత్త విషయంలో డిష్యుం.. డిష్యుం
చెత్త విషయంలో డిష్యుం.. డిష్యుం
Comments
Please login to add a commentAdd a comment