హిందూపురం టౌన్: ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న కార్మికులు ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు సీఐటీయూ నాయకులు, నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్ సప్లయి స్కీమ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వగృహంలో పీఏకు సమ్మె నోటీసును అందజేశారు. వారు మాట్లాడుతూ పెనుకొండ పరిధిలో ఉన్న కార్మికులకు 10 నెలల వేతనాలు, 32 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. హిందూపురం పరిధిలో ఉన్న కార్మికులకు 10 నెలల వేతనాలు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి రాము, యూనియన్ అధ్యక్షుడు సోమశేఖర్, ఆర్గనైజర్ మురళీ, కార్యదర్శి గిరీష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment