రాత్రివేళల్లో ముమ్మర గస్తీ
పుట్టపర్తి టౌన్: అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట, చోరీల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా గస్తీ, వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్‌లో కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. హెల్మెట్ వినియోగం, నిద్రమత్తు పోయేలా ఫేస్ వాష్‌పై అవగాహణ కల్పిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటుసారాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని సూచిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కొత్త ఫాస్టాగ్ రూల్స్ తప్పనిసరి
హిందూపురం అర్బన్: జాతీయ రహదారులు, ఇతర చోట్ల టోల్‌గేట్స్ దాటి వెళ్లే వాహనదారులు (కార్లు, బస్సులు, లారీలు తదితర వాహనాలు) తప్పనిసరిగా సోమవారం నుంచి నూతన ఫాస్టాగ్ రూల్స్ పాటించాలి. ఈ నెల 17 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమలులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం వాహనదారులు కొత్త చెల్లింపు విధానాలు పాటించకపోతే ఆదనంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్ ప్లాజా వద్దకు వెళ్లే 75 నిమిషాల ముందే తగిన రెండింతల మొత్తం ఫాస్టాగ్‌లో ఉండేలా రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రవాణా కార్యాలయంలో కేవైసీ చేయించుకొని తీరాలి. కొంతమంది ఇప్పటికీ అడపాదడపా వాహనాలు బయటకు తీసి తిప్పేవారు టోల్‌ప్లాజా వద్దకు వెళ్లేందుకు 5 నిమిషాల ముందు రీచార్జ్ చేస్తుంటారు. ఇకమీదట అలా కుదరదు. అందుకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) స్వస్తి పలికింది. తగిన మొత్తం ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేని పక్షంలో డబుల్ మొత్తం చెల్లించక తప్పదు. త్వరిత గత ప్రయాణం, డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిబంధనను సోమవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
ఏటి గంగమ్మా..
చల్లంగ చూడమ్మా
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన ఏటి గంగమ్మ తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి. జిల్లా నలమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముందుగా భక్తులు పెన్నహోబిళంలో లక్ష్మీనృసింహస్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర పెన్నా నదిలో మాఘమాస పుణ్యస్నానాలు ఆచరించారు. నది సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయంలో ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి కోళ్లు, గొర్రెలు, మేకలు బలి ఇచ్చి పచ్చని చెట్ల మద్య వనభోజనాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ యువనేత వై.భీమిరెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వనజాక్షి, ఆకుకూర నాగరాజులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ ఈఓ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రాత్రివేళల్లో ముమ్మర గస్తీ
రాత్రివేళల్లో ముమ్మర గస్తీ
రాత్రివేళల్లో ముమ్మర గస్తీ
Comments
Please login to add a commentAdd a comment