శ్రవణానందభరితంగా సంగీత విభావరి
ప్రశాంతి నిలయం: మృదు మధురమైన స్వరాలొలికిస్తూ నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత విభావరి శ్రవణానందభరితంగా సాగింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత అతి రుద్రమహాయజ్ఞం నాలుగో రోజు ఆదివారం కొనసాగింది. వేదపండితులు వేదపఠనం నడుమ యజ్ఞ క్రతువులు నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ రామరత్నం అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పిదప కలైమణి ఎంబార్ కన్నన్, కలైమణి సత్వనరవనన్‌ల బృందం ఆధ్యాత్మిక భక్తిరస సంగీత విభావరి నిర్వహించారు పిదప భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.
శ్రవణానందభరితంగా సంగీత విభావరి
Comments
Please login to add a commentAdd a comment