లేపాక్షి: మండలంలోని గౌరిగానపల్లిలో మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఎస్‌ఐ నరేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో 26 ఏళ్ల మహిళ, అక్కడే ఉండే అశోక్, వెంకటేష్ కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న అశోక్, వెంకటేష్ ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్‌కు మెజిస్ట్రేట్ ఆదేశించారు.
వివాహితపై అత్యాచారయత్నం
తాడిపత్రి రూరల్: బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు జరిగిన విషయం ఇంట్లో తెలిపింది. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంకన్నపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కాటమయ్య తెలిపారు.
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పరిష్కరించాలని డీఆర్‌ఓ విజయ సారథి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి డీఆర్‌ఓ 123 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
విద్యుత్ తీగలు తగిలి
15 గొర్రెలు మృతి
శెట్టూరు: విద్యుత్ తీగలు తెగి మందపై పడటంతో అందులో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మల్లేటిపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కురుబ గోవిందప్ప సుమారు 100 గొర్రెలతో తన పొలంలేనే మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మంద వద్దే నిద్రించాడు. గొర్రెల మంద నిద్రిస్తున్న స్థలం వద్దే విద్యుత్ మెయిన్‌లైన్ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడుగంట సమయంలో విద్యుత్‌తీగ తెగి గొర్రెల మందపై పడింది. మెరుపుతో కూడిన శబ్దం రావడంతో రైతు ఉలిక్కిపడి లేచాడు. రైతు వెంటనే లైన్‌మెన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. విద్యుత్‌షాక్‌కు గురికాంకుండా జాగ్రతపడి గొర్రెలను మందనుంచి బయటకి తీశాడు. అయితే అప్పటికే 15 గొర్రెలు మృతి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment