
ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు
చెన్నేకొత్తపల్లి: ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని పోలీసులు సకాలంలో నిలువరించి ప్రాణాలు కాపాడారు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నేకొత్తపల్లికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి సోమవారం కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. అతని మిత్రుడి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ సత్యనారాయణ వెంటనే హరి, నరసింహ అనే ఇద్దరు పోలీసులను సంఘటన స్థలానికి పంపించారు. అక్కడ ఆ వ్యక్తిని వారు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment