
సాత్వికాహారమే ఆరోగ్య రహస్యం..
కళ్యాణదుర్గం: ఆయనో విశ్రాంత ఉపాధ్యాయుడు. పెన్షన్ కోసం ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని కళ్యాణదుర్గం సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చారు. ఎంతో చలాకీగా కనిపించిన ఆయన్ను చూసి తోటి రిటైర్డు ఉద్యోగులు మల్లికార్జున, తిప్పేస్వామి, హంపన్న, అంజినప్ప, మారెన్న, విశ్వనాథ్, భగవాన్ దాస్ తదితరులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ మాస్టారు పేరు బండయ్య. 103 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యకరంగా ఉన్న ఆయన్ను పెన్షనర్ భవనంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండయ్య విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి తన వంతుగా రూ.5 వేల విరాళం అందజేశారు.
బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చెందిన బండయ్య మాస్టారు 1922 జూలై 10న జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివి జ్యోతిష్యం నేర్చుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చూసి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. తొలి నెల జీతం రూ.30.10 పైసలు. 1978లో ఉద్యోగ విరమణ పొందే నాటికి జీతం రూ.90. ప్రస్తుతం ప్రతి నెలా రూ.26 వేల పెన్షన్ అందుకుంటున్నారు.
బండయ్య మాస్టారు ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం పొబ్బర్లపల్లిలో వ్యవసాయంపై దృష్టి సారించారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడితో ఆదర్శ రైతుగా రాణించారు. కొత్త రకం వంగడాలు పరిచయం చేస్తూ గ్రామంలోని రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. శ్రీశైలంలో సదాశివయ్య అన్న సత్రం చైర్మన్‌గా పనిచేశారు. పలుచోట్ల విరాళాలు సేకరించి నిత్యాన్నదాన సత్రాన్ని విజయవంతంగా నడిపారు.
ఆదర్శ రైతుగా రాణింపు..
ఉద్యోగ ప్రస్థానం...
బండయ్య మాస్టారు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం రెండు పూటల స్నానం చేస్తూ.. సాత్విక ఆహారం, మజ్జిగ, పాలు స్వీకరిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వయసు రీత్యా కంటి చూపు మందగించింది. ఈయన భార్య శివలింగమ్మ నాలుగేళ్ల క్రితం మరణించింది. ఇక ఏడుగురు సంతానంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో కుమారుడు గౌరీ శంకర్‌తో కలిసి మాస్టారు ఉంటున్నారు.

సాత్వికాహారమే ఆరోగ్య రహస్యం..

సాత్వికాహారమే ఆరోగ్య రహస్యం..
Comments
Please login to add a commentAdd a comment