బిగుస్తున్న ఉచ్చు!
హిందూపురం అర్బన్: అనధికార తనిఖీలు.. అక్రమ వసూళ్లతో చర్చనీయాంశమైన హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. జీరో బిజినెస్‌ను ప్రోత్సహించడం ఇందుకోసం భారీగా మామూళ్లు తీసుకుంటున్న వైనంపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 12న కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటి కమిషనర్ మురళీమనోహర్ హిందూపురం వచ్చి ఫిర్యాదుదారులతో పాటు సీటీఓ కృష్ణవేణి, డీసీటీఓలు, ఏసీటీఓలతో సమావేశమై ఆరోపణలపై విచారణ చేపట్టారు. అయితే ఆ నివేదిక సక్రమంగా లేదంటూ సోమవారం కమర్షియల్ ట్యాక్స్ రీజినల్ ఆడిట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ నాగేంద్ర, జాయింట్ కమిషనర్ శేషాద్రితో పాటు డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్ హిందూపురం చేరుకుని మరోమారు ఫిర్యాదుదారులను రహస్యంగా విచారించారు. అనంతరం కార్యాలయానికి చేరుకొని అధికారులతో సమావేశమై పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. హిందూపురం సర్కిల్ పరిధిలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణలతో పలువురు డీలర్లు, వ్యాపారులను కలిసి ప్రాథమికంగా విచారించామన్నారు. నివేదికను మంగళవారం కమిషనర్‌కు నివేదిస్తామన్నారు. కాగా ‘కియా’ పరిశ్రమ నుంచి నేరుగా ఆదాయం రావడం లేదని అధికారులు తెలిపారు. కియా అనుబంధ పరిశ్రమలు ఏడాదికి రూ.60 వేల కోట్ల వరకు లావాదేవీలు చేస్తుండగా.. వాటి ద్వారానే ఆదాయం సమకూరుతోందన్నారు. తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడ నుంచి టాక్స్ వసూలు అవుతోందన్నారు. గతంలో అక్కడి పరిశ్రమల వారు రికార్డులు సరిగా నిర్వహించక పోవడంతో రూ. 100 కోట్లకుపైగా జరిమానా విధించామన్నారు.
‘కమర్షియల్ ట్యాక్స్’ అవినీతిపై మరోసారి విచారణ
అవినీతి అధికారుల గుండెళ్లో
పరుగెడుతున్న రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment