కుమార్తెను చంపి.. తల్లి ఆత్మహత్య
పావగడ: కుమార్తెను చంపి... ఆపై తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం బాగలకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పావగడ తాలూకా బ్యాడనూరు గ్రామపంచాయతీ అధ్యక్షురాలు శృతి (30), ఆడిటర్ గోపాలకృష్ణ దంపతులు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె రోషిణి ఉంది. ఆదివారం రాత్రి బాగలకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంటిలో శృతి నిద్రపోతున్న తన కుమార్తెను చంపి.. తర్వాత ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా డెత్ నోట్ దొరికింది. అందులో తన చావుకు భర్త గోపాలకృష్ణ, ఓ రాజకీయ నాయకురాలు కారణమని పేర్కొంది. గోపాలకృష్ణ వివాహేతర సంబంధం కారణంగానే తన కూతురు శృతి బలవన్మరణానికి పాల్పడిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తల్లీ కూతుళ్ల మృతదేహాలను శిర తాలూకా గుళికేనహళ్ళికి చెందిన పుట్టింటి వారికి అప్పగించారు.
కుమార్తెను చంపి.. తల్లి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment