ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 19న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా కడప నుంచి బయలుదేరిన ఆయన రోడ్డు మార్గాన మంగళవారం రాత్రి 8 గంటలకు పుట్టపర్తిలోని శాంతి భవన్‌కు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. జిల్లాలో 20 సూత్రాల అమలుపై బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకూ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు.
చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్‌ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment