కంది పంట దగ్ధం
గోరంట్ల: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో పది ఎకరాల్లో రైతులు సాగు చేసిన కంది పంట దగ్ధమైంది. గోరంట్ల మండలం వానవోలు తండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన కుంటి సోమ్లనాయక్, తిప్పేనాయక్, రామచంద్రనాయక్ తమకున్న 10 ఎకరాల్లో కంది సాగు చేశారు. పంట చేతికి రావడంతో కొంత మేర కోతలు జరిగి, నూర్పిడి కోసం కుప్ప పోశారు. ఈ క్రమంలో కంది కట్ట కుప్పలకు సమీపంలోని బయలు భూమిలో మంగళవారం మధ్యాహ్నం ఆకతాయిలు నిప్పు రాజేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతూ పంటను చుట్టుముట్టింది. నూర్పిడి కోసం సిద్ధంగా ఉంచిన కంది కట్టెతో పాటు పది ఎకరాల్లోని పంట పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో రూ. లక్షల్లో నష్టపోయినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment