
ధర్మమార్గంలో పయనిస్తేనే సార్థకత
ప్రశాంతి నిలయం: ధర్మ మార్గంలో పయనిస్తేనే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం ఆరో రోజు ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో కొనసాగింది. ఉదయం వేదపండితులు వేదపఠనం నడుమ అతిరుద్ర మహాయజ్ఞ క్రతువులను నిర్వహించారు. సాయంత్రం వేదపండితుడు డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి అతిరుద్ర మహాయజ్ఞం విశిష్టతను వివరించారు.అతిరుద్ర మహాయజ్ఞం అగ్ని దేవుడిని మిక్కిలి సంతృప్తిపరిచి విశ్వశాంతిని ప్రసాదిస్తుందో చక్కగా వివరించారు. మనుధర్మం మేరకు మానవుడు ధర్మ మార్గంలో, చట్టబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో వివరించారు. వేదాలు అందించిన సందేశం మేరకు ధర్మం అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఆచారం మానవుని వెంట జంటగా ఉంటూ ఎలా రక్షిస్తుందో తెలియజేశారు. అనంతరం హిందూస్థానీ సంగీత విద్వాంసుడు కలైమణి డాక్టర్ ఘటమ్ కార్తీక్ బృందం సంగీత కచేరీ నిర్వహించారు. పరమేశ్వరుడిని, సాయీశ్వరుడిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు.

ధర్మమార్గంలో పయనిస్తేనే సార్థకత

ధర్మమార్గంలో పయనిస్తేనే సార్థకత
Comments
Please login to add a commentAdd a comment