నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలి
తాడిమర్రి: ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పీజీ వంశీకృష్ణారెడ్డి డీలర్లను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాల పంపిణీలో అవకతవకలకు పాల్పడొద్దన్నారు. ఎవరైనా తూకాలు తక్కువగా ఇచ్చినా, సరుకులను బ్లాక్ మార్కెట్ తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సరుకులు అన్నింటికీ డీడీలు తీసి పంపాలని సూచించారు. అంతకు ముందు ఆయన స్థానిక బీసీ కాలనీలో ఉన్న 1వ చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి, సీఎస్‌టీడీ శారద తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
కదిరి అర్బన్: నిబంధనల ప్రకారం ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) సుబ్బారావు ఎరువులు, పురుగు మందుల డీలర్లను హెచ్చరించారు. శనివారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో అగ్రి ఇన్‌పుట్ డీలర్స్ మీట్– 2025 జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలన్నారు. ఈ పాస్‌తో విక్రయాలు చేస్తూ రైతులకు బిల్లులు ఇవ్వాలన్నారు. ఎరువులు పురుగుల మందుల చట్టంపై అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారులు క్రమం తప్పకుండా ఎరువులు, పురుగుల మందుల దుకాణాలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఏడీఏ సత్యనారాయణ మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన డీలర్స్ మాత్రమే విక్రయాలు చేయాలన్నారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఉంచాలన్నారు. బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కిరణ్‌కుమార్‌రెడ్డి విత్తన నాణ్యత, పరిశుబ్రత, మొలకశాతంపై అవగాహన కల్పించారు. డీఆర్‌సీ ఏడీ సనావుల్లా, కదిరి డివిజన్ పరిధిలోని డీలర్లు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment