
భూ ఆక్రమణలను అరికట్టండి
బత్తలపల్లి మండలం సంజీవపురం సర్వే నంబర్ 97లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ముల్లుగూరు సంజీవరాయుడు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్‌ఓ విజయసారథికి విన్నవించారు. సర్వే నంబర్ 97లో గ్రామసచివాలయం, ఆర్‌ఎస్‌కే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించారని, మిగిలిన స్థలంలో ‘చింత–నిశ్చింత’ కార్యక్రమం క్రింద చింత చెట్లు నాటారన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు చింత చెట్లను నరికేసి అక్రమంగా ఇంటి పునాదులు తవ్వుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment