
పతాక స్థాయికి నిరుద్యోగం
● గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఉన్నా ఫలితం శూన్యం
● ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కాక చిన్న ఉద్యోగాలకూ దిక్కులేని వైనం
● 20 లక్షల ఉద్యోగాలిస్తామని
ముఖం చాటేసిన చంద్రబాబు
● భృతి ఇస్తామని చెప్పి రిక్తహస్తం చూపడంపై నిరుద్యోగుల మండిపాటు
అనంతపురం నగరంలోని ఓ హోటల్‌లో రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ సేల్స్‌మెన్ ఉద్యోగాలకు నిర్వహించిన వాక్‌ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన
నిరుద్యోగులు వీరు. ఇంజినీరింగ్ మొదలు ఎంబీఏ పట్టభద్రుల వరకు వందల మంది హాజరయ్యారు. దీంతో హోటల్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. చిన్న సేల్స్‌మెన్ ఉద్యోగం కోసం వచ్చిన వీరిని చూస్తే జిల్లాలో
నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.
● గార్లదిన్నెకు చెందిన రాజశేఖర్ ఇటీవల బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మరో ఉద్యోగంలో చేరదామని ఎంత
ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని
రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
● రాప్తాడుకు చెందిన శీనయ్య అనంతపురంలో బీకాం పూర్తి చేశాడు. తన అర్హతకు తగిన జాబు కోసం కొన్ని నెలలుగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఇటీవల ఓ పెట్రోలు బంకు యజమాని వద్ద నిర్వహణ మేనేజర్‌గా చేరాడు. రేయింబవళ్లు పనిచేస్తే రూ.12 వేలు వేతనం. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులది ఇదే పరిస్థితి.

పతాక స్థాయికి నిరుద్యోగం

పతాక స్థాయికి నిరుద్యోగం
Comments
Please login to add a commentAdd a comment