నల్లమాడ: అరవవాండ్లపల్లి తండా సమీపాన నల్లమాడ–పుట్టపర్తి రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మండలంలోని తిప్పయ్యగారిపల్లికి చెందిన రామప్ప, రమేష్‌బాబు, కిరణ్‌కుమార్ బైక్‌పై నల్లమాడ మీదుగా పుట్టపర్తి బయలుదేరారు. అరవవాండ్లపల్లి సమీపానికి వెళ్లగానే బైక్‌పై అదుపుతప్పి కింద పడటంతో ముగ్గురికీ ముఖం, చేతులు, కాళ్లు, ఛాతీపై బలమైన రక్తగాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రులను నల్లమాడలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment