
చెవులను రక్షించుకోవాలి
పుట్టపర్తి టౌన్: విపరీతమైన శబ్దాల నుంచి చెవులను రక్షించుకోవాలని, చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా వైధ్యాధికారి ఫైరోజా బేగం పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం పుట్టపర్తిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర టీఎస్ చేతన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం ముఖ్య అతిథులుగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు. ఎనుములపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ కూడలి వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పిల్లలు, వృధ్ధులు వినికిడి లోపాలకు గురవుతుంటారని, ఎక్కువ శబ్దాలు వినడం వలన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయన్నారు. వినికిడి లోపాలు ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పిల్లల్లో వినికిడి లోపాలు ఉంటే త్వరగా గుర్తించి చికిత్స చేయించాలన్నారు. చెవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ నివేదిత, లెప్రసీ అధికారి తిప్పయ్య, డిప్యూటీ డీఎంహచ్‌ఓ డాక్టర్ సునీల్, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment