కూలి బిడ్డ డిప్యూటీ కలెక్టర్
కూలికి వెళితే తప్ప పూట గడవని కుటుంబంలో పుట్టింది స్వాతి. స్వగ్రామం పరిగి మండలం మోదా పంచాయతీ పరిధిలోని గొరవనహళ్లి గ్రామం. తల్లిదండ్రులు రత్నమ్మ, నాగరాజు. దంపతులిద్దరూ కూలిలుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, స్వాతి పెద్దకూతురు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన స్వాతి... పేదరికాన్ని విద్యతోనే జయించాలని భావించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుంది. ఆ తర్వాత పట్టుదలతో చదివి 2016లో ఎస్‌ఐగా ఎంపికై ంది. రెండేళ్ల కఠోర శిక్షణ తర్వాత 2018లో విధుల్లో చేరింది. అయినా ఎక్కడో అంసతృప్తి. తనలాంటి పేదలకు ఏదైనా చేయాలంటే ఇంకా ఉన్నతస్థానంలో ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే గ్రూప్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించింది. 2023లో గ్రూప్–1లో సత్తాచాటి ఏకంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. సంకల్పబలం ముందు కష్టాలన్నీ కరిగిపోగా.. స్వాతి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. – పరిగి:
Comments
Please login to add a commentAdd a comment