అవార్డుల కండక్టరమ్మ
కదిరి డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మీనరసమ్మ కష్టేఫలి సూత్రాన్ని నమ్ముకున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఆర్టీసీ కండక్టరుగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం కదిరి డిపోలో పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ.. మదనపల్లి, హిందూపురం పల్లెవెలుగు సర్వీసుల్లో డ్యూటీ చేస్తున్నారు. అందరికంటే మిన్నగా కలెక్షన్‌ను రాబట్టి సంస్థ అభివృద్ధికి దోహదపడుతున్నారు. వృత్తిపట్ల ఆమె అంకితభావం...సంస్థ పురోభివృద్ధిలో ఆమె భాగస్వామ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఉత్తమ కండక్టర్‌గా రాష్ట్రస్థాయి అవార్డు అందించారు. అలాగే 2023, 2024 సంవత్సరాల్లో కదిరి డిపోలోనూ పలుసార్లు ఉత్తమ కండక్టర్‌గా నగదు అవార్డులు అందించారు. అటు కుటుంబాన్ని, ఇటు వృత్తి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న లక్ష్మీనరసమ్మ ఎందరో మహిళా ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – కదిరి అర్బన్:
Comments
Please login to add a commentAdd a comment