ధైర్యమే ఊపిరిగా ముందుకు సాగాలి
పుట్టపర్తి టౌన్: ఇంటాబయట ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ధైర్యమే ఊపరిగా ముందుకు సాగాలని మహిళలకు ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి పోలీస్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి, ఆయుధాల వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సవాళ్లనుఽ అధిగమించాలంటే ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలన్నారు. సెల్‌ఫోన్ వినియోగం వల్ల ఒనగూరే లాభాలు, అనర్థాలపై షార్ట్ ఫిలిం ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఏఓ సుజాత, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. డీపీఓ మహిళా సిబ్బందితో కలసి ఎస్పీ రత్న కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment