జనరిక్ మందులపై ప్రచారం చేయండి
పెనుకొండ: జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన పెంచి వాటిని ప్రజలు వినియోగించేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి జన ఔషది దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని సీమాంక్ సెంటర్‌లో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందితో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనరిక్‌లో మందులు అందుబాటులో ఉన్నా.. ప్రజలు బ్రాండెడ్ పేరుతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామగ్రామానా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు వివరించి జనరిక్ ఔషధాలను వినియోగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమంతు, డిప్యూటి డీఎంహెచ్‌ఓ మంజువాణి, వైద్యాధికారి మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment