చిలమత్తూరు/తనకల్లు: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనంపై వరుణుడు కరుణ చూపాడు. వేసవి తీవ్రతతో జిల్లాలో పక్షం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శనివారం మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మబ్బులు కమ్ముకున్నాయి. వెంటనే ఉరుములతో కూడిన వడగండ్ల వాన కురిసింది. తనకల్లు మండలంలో ఎన్ హెచ్–42పై వడగండ్లు పెద్ద ఎత్తున పడటంతో యువకులు కేరింతలు కొట్టారు. వడగండ్లను రోడ్డుపై కుప్పగా పోసి సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు. కాగా, అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో టమాట, మొక్కజొన్న, దబ్బ చిక్కుడు పంటలు దెబ్బతిన్నాయి. ఇక చిలమత్తూరు మండల పరిధిలోని మొరసలపల్లిలోనూ వడగళ్ల వాన కురిసింది. పాలేపల్లిలో 20 ఎకరాల మేర కోత దశకు వచ్చిన వరి నేలపాలైంది. వడగండ్ల దెబ్బకు వడ్లు నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో వడగండ్ల వాన
జిల్లాలో వడగండ్ల వాన
జిల్లాలో వడగండ్ల వాన
జిల్లాలో వడగండ్ల వాన