● దర్జాగా షెడ్డు వేస్తున్న టీడీపీ నేత
చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. అంతేకాకుండా ఆ స్థలంలో దర్జాగా షెడ్ల నిర్మాణం చేపట్టాడు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొట్నూరు సర్వే నంబరు 259/1సీలో 18 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఇది గ్రామ కంఠంగా రికార్డుల్లో నమోదై ఉంది. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకుడు గతంలోనే ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సదరు నాయకుడు మళ్లీ కబ్జాకు తెగించాడు. శనివారం మున్సిపల్ అధికారులు నాటిన బోర్డును తొలగించి షెడ్ల నిర్మాణాలు చేపట్టాడు. దీంతో మున్సిపల్ అధికారులు ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు నాయకుడు... గతంలోనూ పట్టణంలోని మరొక ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చేజిక్కుంచుకున్నారన్న ఆరోపణలున్నాయి.
న్యూస్‌రీల్
మున్సిపాలిటీ స్థలం కబ్జా