
మూడు రకాల చెత్తలు వేరు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రజలు మూడు రకా ల చెత్తలను వేరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి, పొడి, హానికరమైన చెత్తల ను వేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. అక్కడి సిబ్బందికి తడి, పొడి, హానికరమై న చెత్తలపై అవగాహన కల్పించారు.
తడి, పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయవచ్చన్నారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్త రీ సైక్లింగ్‌కు పంపిస్తామని చెప్పారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ న్యాప్‌కిన్స్, మెడిసిన్స్, గాజు, తదితరమైనవి హానికరమైనవని తెలిపారు. వీటిని రెడ్ కలర్ డబ్బాలో వేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment