బరితెగిస్తున్న తెలుగు తమ్ముళ్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకుల భూములపై కన్ను
ఆక్రమణదారులపై ఈ ఏడాది జూలైలో ఫిర్యాదు
తాజాగా మళ్లీ సరిహద్దులు దాటి ఆక్రమణకు పాల్పడుతున్న పరిస్థితి
మళ్లీ ఫిర్యాదు చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల స్థలా లను తెలుగు తమ్ముళ్లు దర్జాగా కబ్జా చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాలో.. వీరి బారి నుంచి బడిని కాపాడుకోవాలో తెలీక అక్కడి టీచర్లు సతమతమవుతున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి టీడీ పీ నాయకులు బరి తెగించారు. ఇప్పటికే అధికారు లకు పలు పర్యాయాలు పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యా దు చేశారు. అయినా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. అదే పనిగా పాఠశాల భూముల్లో పాగా వేస్తున్నారు. తాజాగా పాఠశాల ప్రహరీ హద్దులను దాటి కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై అటు ఎస్‌ఐకు, ఇటు వీఆర్‌ఓకు గురువారం ఫిర్యాదు చేశారు.
గురుకుల భూములపై కన్ను
ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో 1984లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రెసిడెన్సియల్ స్కూల్ సొసైటీ పేరుతో స్థానికుల నుంచి భూములను కొనుగోలు చేశారు. సంపతిరా వు, వావిలపల్లి, గురుగుబిల్లి కుటుంబీకుల నుంచి 13.7ఎకరాలను సొసైటీ కొనుగోలు చేసింది. ఇది కా కుండా ప్రభుత్వం మరో 40ఎకరాల ప్రభుత్వ భూ మిని కూడా గురుకుల పాఠశాలకు కేటాయించింది. మొత్తంగా సుమారు 54ఎకరాలు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ పేరు మీదే ఉంది. ఇవన్నీ సర్వే నంబర్ 112 సబ్ డివిజన్ 635/2లో ఉన్నాయి. ఈ భూముల్లో కొంతమేర భవనాలు నిర్మించారు. మిగ తా భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఉంచారు. ఖాళీగా ఉన్న భూములపై అక్కడి కీలక నేతల కన్ను పడింది. తమ బినామీలను రంగంలోకి దించి దశల వారీగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తొలుత 2014–19లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకరిద్దరు గురుకుల పాఠశాల భూములను ఆక్రమించి, చదును చేసి నీలగిరి మొక్కలు వేసేశారు.
మళ్లీ అధికారంలోకి వచ్చాక
మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆక్రమణదారులు చొరబడ్డారు. తమ కుటుంబీకులే అప్పట్లో రెసిడెన్షియల్ సొసైటీకి భూములు విక్రయించారని, ఆ భూములను 20ఏళ్ల లోపు వినియోగించకపోతే తిరి గి అసలు యజమానుల కుటుంబీకులు స్వాధీనం చేసుకుని, చదును చేసుకుని, తమ అవసరాలకు వినియోగించుకోవచ్చన్న కారణాలు చూపించి గురుకుల పాఠశాల భూములను ముగ్గురు దర్జాగా చదు ను చేసి ఆక్రమించారు. వాస్తవంగా రెసిడెన్షియల్ సొసైటీ కొనుగోలు చేసిన భూములకు ఆక్రమణదారులు చెప్పిన నిబంధన వర్తించదు. సొసైటీ పేరుతో రిజిస్ట్రైన భూములను భవిష్యత్‌లో అవసరాల దృష్ట్యా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. కోర్టు కూ డా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఖాళీగా ఉందని కొందరు, డీ పట్టా భూమి ఉందని మరొకరు అక్రమంగా చదును చేసేశారు. దీనిపై ఈ ఏడాది జూలై లో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపారు. వివాదాస్పద భూముల తో పాటు భూములకు హద్దులు నిర్ణయించారు.
తాజాగా సరిహద్దులు దాటి కబ్జా
ఐదు నెలల కింద అంతా విచారణ జరిపి, హద్దులు ఫిక్స్ చేయగా, ఇప్పుడా హద్దులు దాటి అధికార పార్టీకి చెందిన వ్యక్తి గురుకుల పాఠశాల భూమిని కబ్జా చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ తదితర సిబ్బంది అభ్యంతరం తెలిపినా వెనక్కి తగ్గలేదు. తన కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత చెప్పినా బరితెగించి, భూములకు ఆక్రమిస్తుండటంతో గురువారం ఎస్‌ఎంపురం వీఆర్‌ఓకు, ఎచ్చెర్ల స్టేషన్ ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు.
ఆక్రమణపై ఫిర్యాదు
ఐదు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సరిహద్దులు నిర్ణయించారు. ఆ సరిహద్దులు దాటి కబ్జా చేస్తున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, పాఠశాల భూములను కాపాడాలని అటు వీఆర్‌ఓ, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశాం. – ఎం.గుణస్వామి, ఏపీ గురుకుల పాఠశాల ఎస్‌ఎంపురం, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment