ఆస్పత్రి వైద్య వర్గాల్లో కలకలం
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేసిన చల్లా రవికుమార్ జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. అప్పట్లో ఈయన ఇచ్చిన సదరం సర్టిఫికెట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పరిశీలన చేసిన దర్యాప్తు అధికారు లు తప్పుడు సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. తా జాగా ఈ సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన రవికుమార్‌తో పాటు వాటిపై సంతకాలు చేసిన అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.జయశ్రీ తో పాటు మరో ఇద్దరు వైద్యులు నవీన్, నామగల్లేశ్వరిలకు ప్రభుత్వ కార్యదర్శి మంజుల హో స్మాని బుధవారం రాత్రి నోటీసులు జారీ చేశా రు. దీంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. సద రం సర్టిఫికెట్లు జారీ చేసిన రవికిరణ్ శ్రీకాకుళం రిమ్స్‌లో పనిచేస్తుండగా మరో వైద్యురాలు నాగమల్లేశ్వరి అనధికార గైర్హాజరులో ఉన్నారు. నవీన్ టెక్కలిలో పనిచేస్తున్నారు. అప్పట్లో ఆ స్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న జయశ్రీ ప్రస్తుతం నరసన్నపేటలోనే వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరందరికీ నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. వైకల్యశాతం ఆర్థో సర్జన్ నిర్ధారిస్తారని, నిబంధనల మేరకు తాము కౌంటర్ సంతకాలు చేశామని, తమకు నోటీసులు ఇవ్వడం అభ్యంతకరమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోరం లేక సమావేశాలు వాయిదా
అరసవల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు కోరం లేకపోవడంతో వాయిదా ప డ్డాయి. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన మొత్తం ఏడు స్థాయీ సంఘ సమావేశాలకు కూడా జెడ్పీటీసీ సభ్యులెవ్వరూ హాజరుకాకపోవడంతో అన్ని సమావేశాలూ వాయిదా పడ్డాయి. దీంతో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ సూచనల మేరకు జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలను శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీ సీఈ ఓ శ్రీధర్‌రాజా ప్రకటించారు. దీంతో అధికారులంతా ఎవరి విధుల్లోకి వారు చేరుకున్నారు.
కార్పొరేట్ సంస్థల చొరవ అభినందనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ముఖ్య ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పరిశ్రమలు, పలు కార్పొరేట్ యాజమాన్య ప్రతినిధులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచినీటి వసతి, సోలార్ లైట్ల ఏర్పాటు, పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు తోడ్పాటు, పలాసలో డయాలసిస్ యూనిట్ల నిర్వహణ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. పనుల అంచనాలను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.
ఆస్పత్రి వైద్య వర్గాల్లో కలకలం
Comments
Please login to add a commentAdd a comment