ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ రెండో డిపోలో ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 28 నుంచి ఆందోళనలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్.బాబు, వై.దుర్గారావు డిమాండ్ చేశారు. డిపో కార్యాలయ ఆవరణలో గురువా రం వారు మాట్లాడుతూ స్పేర్ ఉన్న డ్రైవర్ కండక్టర్ల తో రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఖాళీలను డ్యూటీ చార్ట్ భర్తీ చేయకపోవడం వల్ల డ్రైవర్, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై యాజమాన్యంతో మాట్లాడినా ఫలితం లేకపోయిందన్నారు. ఏడీసీ సఫలింగ్ చేయడం లేదని, అక్రమ చార్జిషీట్లు, అక్రమ పనిష్మెంట్లు ఇస్తున్నారని, 1/19 సర్కులర్ అమలు చేయట్లేదని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని, అసిస్టెంట్ మేనేజర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, చార్టు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వీటికి నిరసనగా శుక్రవారం ఎర్ర బ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హాజరై నిరసన తెలియజేస్తామన్నారు. సమావేశంలో ఈయూ నాయకులు కె.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment