లోయలో పడి ఇద్దరు మృతి
● ఒడిశాలో దుర్ఘటన ● మృతులు సూదికొండ వాసులు
కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అర్సిలింగి ఘాట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. సూదికొండకు చెందిన ముగ్గురు కొయంపూర్‌కు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి లోయలో పడిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో సూదికొండకు చెందిన సయ్యద్ ఫరీద్ (27) అక్కడికక్కడే మృతిచెందగా, బుట్ట గంగాధర్ (35) గజపతి జిల్లా పర్లాఖిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గంగాధర్ భార్య బుట్ట సరళకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం పెద్దాసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోయలో పడి ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment