కార్గో ఎయిర్‌పోర్టును అడ్డుకుందాం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ నెల 18, 19 తేదీల్లో బాధిత ప్రాంతాలలో చేపట్టనున్న ప్రచార యాత్రను విజయవంతం చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో మంగళవారం వామపక్ష పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి పొందుతుంటే ప్రభుత్వం ఈ ప్రాంతంలో విధ్వంసకర ఎయిర్ పోర్టుతో వారి బతుకులను నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు వాసుదేవరావు, సీపీఐ(ఎం.ఎల్) కార్యదర్శి చాపర వేణుగోపాల్, న్యూ డెమొక్రసీ నాయకులు వంకల మాధవరావు, జోగి అప్పారావు, ఎల్.రామస్వామి, రామ్మూర్తి, ధనుంజయ, గుంటు రామారావు, జోగి శ్రీదేవి, వల్లభరావు, మైనపల్లి శేఖరం, గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment