బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐ బోక్ రీజనల్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు, కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు గిరిధర్ నాయక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఉపాధ్యక్షురాలు జి.కరుణ, ఇండియన్ బ్యాంక్ మహిళా కన్వీనర్ శ్రావణి, కో–ఆర్డినేషన్ జాయింట్ కార్యదర్శి ఎ.సూర్య, ఓబీసీ ఉద్యోగ సంఘ నాయకులు సూర్యకిరణ్, నరేష్ శ్రీనివాస్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మార్చి 24, 25 తేదీలలో సమ్మె
శ్రీకాకుళం అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్‌న్స్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షలమంది ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల నెల 24, 25 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ శ్రీకాకుళం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం పెద్దపాడు రోడ్డులోని ఎస్‌బీఐ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సమ్మె ఉద్దేశం, ప్రధానమైన డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రెటరీ కృష్ణ కిషోర్, లోకల్ సెక్రటరీ నాయుడు, ఐబోక్ కిషోర్, బెఫి మండ శ్రీనివాసరావు, ఏఐబీఈఏ శ్రావణి పాల్గొన్నారు.
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment