టెక్కలి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
టెక్కలి: టెక్కలి సబ్ రిజిస్ట్రార్ మత్స్య ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మందస మండలం నుంచి టెక్కలి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో భాగంగా ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. మందస మండలంలో పనిచేసిన కాలంలో అక్కడ దళారీలుగా వ్యవహరించిన కొంత మందితో టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎనీవేర్ ప్రక్రియ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ‘ఏం జరుగుతోంది’ అనే కథనం సాక్షిలో వెలువడింది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో డబుల్ రిజిస్ట్రేషన్లు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదే ఎస్‌ఆర్‌ఓ గతంలోనూ ఒకసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.
వీధుల్లోకి ఆస్పత్రి మురుగునీరు
నరసన్నపేట: స్థానిక వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మురుగు నీరు పక్కనే ఉన్న కోవెలవీధిలోకి వస్తోంది. దీంతో ఆ దుర్వాసనకు స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై చాలాసార్లు ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఆస్పత్రి వార్డుల్లో రోగులు, ఆస్పత్రి సిబ్బంది వినియోగిస్తున్న బాతురూమ్‌లు, టాయిలెట్ల నీరు ఇలా వీధి మధ్యలోకి వదిలేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 31 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పోరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి ఎస్పీ సందర్శించారు. అనంతరం ఎచ్చెర్లలో డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా విశాఖపట్నంలోని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచేందుకు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్‌ల ఎస్కార్ట్ సహాయంతో తరలించారు. ఎస్పీతో పాటు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో డీఎస్పీలు ిసీహెచ్ వివేకానంద, డీవీవీఎస్‌ఎన్ మూర్తి, వెంకటఅప్పారావుల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు విధులు నిర్వర్తించారు.
టెక్కలి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment